వాళ్లు ముగ్గురు 75 ఏళ్ల కుర్రాళ్లు... వాళ్లది పవర్ ఫుల్ కాంబో: మంత్రి నారా లోకేష్

Nara Lokesh Calls Modi Rajnath Singh and Chandrababu 75 Year Old Youths
  • పుట్టపర్తిలో ఏఎంసీఏ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ
  • మోదీ, రాజ్ నాథ్, చంద్రబాబు 75 ఏళ్ల కుర్రాళ్లు అంటూ లోకేష్ ప్రశంసలు
  • వారిలో 25 ఏళ్ల యువకులు ఉన్నారని, వారి స్పీడ్ తట్టుకోలేమన్న లోకేష్
  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఐరన్ మ్యాన్‌గా అభివర్ణన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వీరంతా 75 ఏళ్ల కుర్రాళ్లు అంటూ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి వయసు 75 ఏళ్లయినా, వారిలో 25 ఏళ్ల యువకులు ఉన్నారని, వారి స్పీడ్ చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. ఈ ముగ్గురి వేగాన్ని తట్టుకోవడం ఎవరి వల్లా కాదని లోకేష్ వ్యాఖ్యానించారు. వీరిది పవర్ ఫుల్ కాంబినేషన్ అని కొనియాడారు.

పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్ర మారబోతోందని లోకేష్ అన్నారు. రక్షణ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయని, యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, పాకిస్థాన్‌కు గట్టి జవాబిచ్చిన 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తుచేస్తూ, దాని వెనుక ఉన్న అసలైన శక్తి, ఐరన్ మ్యాన్ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అని లోకేష్ ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Narendra Modi
Chandrababu Naidu
Rajnath Singh
Andhra Pradesh
Advanced Medium Combat Aircraft
AMCA Project
Puttaparthi
Defense Sector
Operation Sindoor

More Telugu News