ప్రేమకు లొంగిపోయిన 'రౌడీ జనార్ధన'.. విజయ్ పుట్టినరోజున ఇంట్రెస్టింగ్ పోస్టర్
- విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా 'రౌడీ జనార్ధన' చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
- వర్షంలో తడుస్తూ, చేతిలో రివాల్వర్‌తో ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్
- రవికిరణ్ కోలా దర్శకత్వం.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం
- ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేశ్
- డిసెంబర్ లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'రౌడీ జనార్ధన' నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ స్టిల్ మరింత ఆసక్తిని పెంచింది.
విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్‌లో విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ, చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉన్నారు. ఓ యువతి పాదాలను ఆయన తన ఛాతీపై ఉంచుకుని, రొమాంటిక్‌గా చూస్తూ కనిపించారు. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "ప్రపంచంతో పోరాడే మనిషి... కానీ ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు. మా రౌడీ జనార్ధన విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని క్యాప్షన్ జోడించింది.
'రాజా వారు రాణి గారు' చిత్రంతో గుర్తింపు పొందిన రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరికొత్త గెటప్, డైలాగ్ డెలివరీతో మాస్ అవతారంలో కనిపించి అంచనాలు పెంచేశారు.
1980ల కాలంలో తూర్పు గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.