నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం... ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు...?

Assembly Elections 2024 Results Party Wise Seats
  • 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు
  • సోమవారం నాడు ఓట్ల లెక్కింపు
  • బెంగాల్ లో బీజేపీ విజయభేరి
  • తమిళనాడులో విజయ్ పార్టీ సంచలనం
  • కేరళలో వామపక్ష పాలనకు ముగింపు
  • అసోం, పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే పాలన
గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తి కలిగించిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు చేపట్టారు. వెల్లడైన ఫలితాల ప్రకారం... పశ్చిమ బెంగాల్ లో బీజేపీ సంచలన విజయం సాధించింది. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బీజేపీ అద్భుతపోరాటంతో చెక్ పెట్టింది. అసోంలో ఎన్డీయే సర్కారు హ్యాట్రిక్ కొట్టి, వరుసగా మూడో పర్యాయం అధికార పీఠం ఎక్కింది. 

తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ అరంగేట్రంలోనే అదరగొట్టింది. మ్యాజిక్ ఫిగర్ (118) రాకపోయినా 107 స్థానాలతో అతి పెద్దగా పార్టీగా అవతరించింది. అధికార డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచాయి. 

ఇక, కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమి ఘోరంగా ఓడిపోగా, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఘనవిజయం అందుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ ఎన్డీయే కూటమి అధికారం నిలుపుకుంది. 

పశ్చిమ బెంగాల్ (293)
బీజేపీ- 206 విజయాలు, మరో రెండు చోట్ల ఆధిక్యం
తృణమూల్ కాంగ్రెస్- 77 విజయాలు, మరో రెండు స్థానాల్లో ఆధిక్యం
కాంగ్రెస్- 2
వామపక్షాలు-2
ఇతరులు-2
గమనిక: ఫాల్టా స్థానంలో ఈ నెల 21న మరోసారి పూర్తి స్థాయి పోలింగ్ జరగనుంది.

తమిళనాడు (234)
టీవీకే - 107
డీఎంకే - 74
అన్నాడీఎంకే - 53

కేరళ (140)
యూడీఎఫ్ - 102
ఎల్డీఎఫ్ - 35
ఎన్డీయే - 3

అసోం (126)
ఎన్డీయే - 102
కాంగ్రెస్ - 21
ఏఐయూడీఎఫ్ - 2
ఇతరులు - 1

పుదుచ్చేరి (30)
ఏఎన్నార్సీ (ఎన్డీయే) - 18
కాంగ్రెస్ - 6
టీవీకే - 3
ఇతరులు - 3


Go Back to Shorts
Assembly Elections 2024
West Bengal
Tamil Nadu
Kerala
Assam
Puducherry
BJP
DMK
Congress
Mamata Banerjee

More Telugu News