ఒంటరి పోరాటం చేసిన జడేజా.. లక్నో ముందు మోస్తరు లక్ష్యం

Ravindra Jadeja scored 43 not out off 29 to give RR something to fight on Lucknow Super Giants
  • లక్నోతో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్కోరు 159/6
  • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న లక్నో బౌలర్లు
  • ఆరంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచిన షమీ, మోహ్‌సిన్
  • చివర్లో మెరిసిన రవీంద్ర జడేజా.. 29 బంతుల్లో 43 పరుగులు
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జ‌రుగుతున్న‌ ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్‌ను 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకే కట్టడి చేశారు. రవీంద్ర జడేజా (43 నాటౌట్) ఒంటరి పోరాటం చేయడంతో రాజస్థాన్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అంతకుముందు టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే మహమ్మద్ షమీ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మోహ్‌సిన్ ఖాన్ కూడా వికెట్ పడగొట్టడంతో రాజస్థాన్ తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఆ తర్వాత కూడా లక్నో బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రాజస్థాన్ బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఒక దశలో రాజస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండ‌ర్‌ రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. జడేజా మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ పోరాడటానికి వీలైన స్కోరును బోర్డుపై ఉంచగలిగింది.
Go Back to Shorts
LSG vs RR
Ravindra Jadeja
Lucknow Super Giants
Rajasthan Royals
IPL 2026

More Telugu News