ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో

Former PCB CEO Wasim Khan Resigns From Key ICC Post
  • ఐసీసీ జనరల్ మేనేజర్ గా నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్
  • ఇంగ్లాండ్ లోనే జన్మించి అక్కడే క్రికెట్ ఆడిన వాసిమ్
  • మూడేళ్ల పాటు పాక్ క్రికెట్ బోర్డు సీఈవోగా పని చేసిన వైనం

ఐసీసీ జనరల్ మేనేజర్ గా గత నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్, తాజాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి ఈ బాధ్యతలను స్వీకరించిన ఆయన, తన పదవీ కాలం ముగియకుండానే వైదొలగడం గమనార్హం.


వాసిమ్ ఖాన్ ఇంగ్లాండ్‌లో జన్మించి అక్కడే కౌంటీ క్రికెట్ ఆడారు. పాకిస్థాన్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యంతో 2019 నుండి మూడేళ్ల పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈవోగా పనిచేశారు. 


గత రెండేళ్లుగా ఐసీసీలో ఉన్నత స్థాయి అధికారులు వరుసగా వైదొలుగుతున్నారు. ఇప్పటికే క్రిస్ టెట్లీ, అలెక్స్ మార్షల్ వంటి వారు తప్పుకోగా, ఇప్పుడు వాసిమ్ ఖాన్ కూడా ఆ జాబితాలో చేరారు. వీరి స్థానాల్లో గౌరవ్ సక్సేనా, ఆండ్రూ వంటి వారు కొత్త బాధ్యతలు చేపట్టారు.

Go Back to Shorts
Wasim Khan
ICC
Pakistan Cricket Board
PCB
Geoff Allardice
Cricket
ICC General Manager
Sports News
Cricket Administration

More Telugu News