టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈసారి కూడా సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్
- సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్
- ఢిల్లీకి ఇది వరుసగా 8వ టాస్ విజయం, హైదరాబాద్‌కు 7వ టాస్ ఓటమి
- ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అక్షర్ పటేల్‌కు ఇది 100వ మ్యాచ్
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది. గత కొన్ని మ్యాచ్ లలో సన్ రైజర్స్ టాస్ ఓడినా, మొదట బ్యాటింగ్ చేసి, ఆపై ప్రత్యర్థి జట్లను కట్టడి చేసి విజయం సాధిస్తోంది. ఇవాళ కూడా సన్ రైజర్స్ అదే రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా ఎనిమిదో టాస్ విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా ఏడో టాస్ ఓటమి. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయగా, ఢిల్లీ ఛేజింగ్‌కే మొగ్గుచూపడం గమనార్హం.
టాస్ గెలిచిన అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ, "టాస్‌లో అదృష్టం బాగానే కలిసొస్తోంది. టాస్ గెలిచినట్టే, మ్యాచ్‌లలో కూడా గెలిచి ఉంటే బాగుండేది. ఢిల్లీ తరఫున ఇది నాకు 100వ మ్యాచ్, ఈ మ్యాచ్‌లో గెలుస్తామని ఆశిస్తున్నా" అని అన్నాడు. జట్టులో అకీబ్ నబీ స్థానంలో నితీశ్ రాణా ఆడుతున్నట్లు తెలిపాడు.
సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ, "ఈ పిచ్ గత మ్యాచ్ లతో పోలిస్తే కొంచెం నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. అందుకే స్పిన్ ఆప్షన్ కోసం హర్ష్ దూబేను తిరిగి జట్టులోకి తీసుకున్నాం," అని వివరించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్
పతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి. నటరాజన్, లుంగి ఎంగిడి.
సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఎషన్ మలింగ.
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్:
ఢిల్లీ క్యాపిటల్స్: కరుణ్ నాయర్, దుష్మంత చమీర, అశుతోష్ శర్మ, త్రిపురాన విజయ్, అకీబ్ నబీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్: స్మరణ్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, దిల్షాన్ మధుశంక, హర్షల్ పటేల్.