ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్టాప్లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు!
- రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్
- 40 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ
- నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారికి స్టేడియంలోకి నో ఎంట్రీ
ఈ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రేక్షకులకు ఇబ్బందులు లేకుండా 11 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మ్యాచ్ టిక్కెట్లు ఉన్నవారు మాత్రమే స్టేడియంకు రావాలని పోలీసులు మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు.
కాగా, సొంత మైదానంలో ఆడిన సన్ రైజర్స్ తొలి మ్యాచ్లోనే పరాజయం పాలైంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, రాజస్థాన్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు గెలిచి విజయోత్సాహంతో ఉంది.