'జన నాయగన్' లీక్.. మాకేం సంబంధం లేదన్న సెన్సార్ బోర్డ్
దళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమా లీకేజీ వ్యవహారంలో తమ ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) మహారాష్ట్ర అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా సీబీఎఫ్సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
'జన నాయగన్' సినిమా డిజిటల్ సినిమా ప్యాకేజీ (డీసీపీ)ని మార్చి 17నే ముంబైలో నిర్మాతలకు అప్పగించామని, అప్పటి నుంచి అది వారి వద్దే ఉందని సీబీఎఫ్సీ తెలిపింది. సినిమా కంటెంట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని, దానికి సంబంధించిన కీ డెలివరీ మెసేజ్ (కేడీఎం) కేవలం నిర్మాత వద్ద మాత్రమే ఉంటుందని వివరించింది. ఆ కీ లేకుండా సినిమాను చూడటం గానీ, యాక్సెస్ చేయడం గానీ సాధ్యం కాదని పేర్కొంది.
ఇటీవల 'జన నాయగన్' సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు ఆన్లైన్లో లీక్ కావడం తీవ్ర దుమారం రేపింది. కొంత కాలంగా సెన్సార్ బోర్డుతో ఉన్న విభేదాల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే లీకేజీ వెనుక సీబీఎఫ్సీ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ పైరసీ ఘటనను రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, రిషబ్ శెట్టి, విజయ్ దేవరకొండ వంటి పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. విజయ్‌కు, చిత్ర బృందానికి తమ మద్దతు ప్రకటించారు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. లీకైన కంటెంట్‌ను చూడటం, షేర్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఏ మాధ్యమంలోనూ ఈ క్లిప్స్‌ను సర్క్యులేట్ చేయవద్దని కోరింది.