Kolusu Parthasarathy: జగన్ పేరు కూడా అలాంటిదే: మంత్రి కొలుసు పార్థసారథి
"గ్రామాల్లో శుభకార్యాల సమయంలో అమంగళకరమైన పేర్లు పలకకూడదని ఒక సంప్రదాయం ఉంటుంది. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 'జగన్' అనే పేరు కూడా అలాంటిదే" అంటూ రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో జగన్ అనుసరించిన వైఖరి రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని, ఆయనొక అభివృద్ధి నిరోధక శక్తి అని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ తన కొత్త రాజధాని ప్రతిపాదనతో రాష్ట్ర ప్రజల ముందు నవ్వులపాలయ్యారని, సొంత పార్టీ శ్రేణులే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.
జగన్... రాష్ట్రానికి పట్టిన చీడ
రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఒక గొప్ప సంబరం లాంటిదని, అలాంటి సమయంలో జగన్ 'కంటిలో నలుసులా', 'రాష్ట్రానికి పట్టిన చీడపీడలా' తయారయ్యారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా అమరావతికి మద్దతు తెలిపితే, ఒక్క వైసీపీ మాత్రమే పార్లమెంటులో వాకౌట్ చేసి రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టిందని గుర్తుచేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన రాజధాని విషయంలో జగన్ వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని విమర్శించారు. ఆయన పాలనలో రాష్ట్రం ఐదేళ్ల పాటు చీకటి రోజులను చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వికేంద్రీకరణ పేరుతో చారిత్రక తప్పిదం
2019-24 మధ్య జగన్ చెప్పిన 'అభివృద్ధి వికేంద్రీకరణ' నినాదం శుద్ధ అబద్ధమని పార్థసారథి స్పష్టం చేశారు. "అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ప్రకటించి, అధికారంలోకి రాగానే మాట మార్చారు. సూట్‌కేసు రాజకీయాలు చేస్తూ రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడారు. ప్రజలు ఈ నాటకాన్ని గమనించి, మూడు రాజధానుల ఆలోచనను ఛీత్కరించి కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు" అని ఎద్దేవా చేశారు.
చేసిన తప్పులను ఒప్పుకోకుండా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా తన ఆలోచనలనే రుద్దే నియంతలా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు. రాజధాని పేరును 'మావిగన్'గా మార్చాలని చూడటం ఆయన 'తుగ్లక్' పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
అమరావతి.. ఐదు కోట్ల మంది ఆత్మగౌరవం
విభజనతో నష్టపోయిన ఆంధ్రులకు అమరావతి ఒక ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. "ఏ నాయకుడూ చేయలేని సాహసాన్ని చంద్రబాబు చేశారు. ఆయన ఒక్క పిలుపుతో రైతులు 34,000 ఎకరాల విలువైన భూములను రాజధాని కోసం త్యాగం చేశారు. అమరావతి ఒక 'సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్'. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణకు లక్షల కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. అదే స్థాయిలో అమరావతి అభివృద్ధి చెందితే, ఏటా వచ్చే 4-5 లక్షల కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోని ప్రతీ మూలను అభివృద్ధి చేయవచ్చు" అని వివరించారు. అమరావతిలో పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఆయన స్పష్టం చేశారు.
కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు
గత 20 నెలల కూటమి పాలనలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టిందని పార్థసారథి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సాధించలేకపోయిన వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులను సాధించి ప్రజా సంక్షేమానికి వినియోగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి సమగ్రాభివృద్ధి చేస్తున్నామన్నారు. కర్నూలుకు కారిడార్, ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లో పోర్టులు, రిఫైనరీ, విశాఖను డేటా సెంటర్, సాఫ్ట్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
"పెట్టుబడిదారులు వసతులు, కనెక్టివిటీ ఉన్న చోటుకే వస్తారు. జగన్‌లా 'చెట్టు కింద కూర్చుని చర్చలు జరపండి' అంటే ఎవరూ రారు" అని ఆయన ఎద్దేవా చేశారు. అప్పులు తెచ్చినా, సంపద సృష్టించి వాటిని తీర్చే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని, జగన్ ఇప్పటికైనా అబద్ధాలు మాని వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు.