Google AI: మన్యం యువకుడి సత్తా.. గూగుల్‌లో రూ. కోటి ప్యాకేజీతో ఉద్యోగం
సాధారణ కుటుంబంలో పుట్టి, తెలుగు మీడియంలో చదివిన ఓ యువకుడు తన ప్రతిభతో అద్భుతం చేశాడు. టెక్నాలజీలో వస్తున్న సరికొత్త మార్పులను అందిపుచ్చుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో నైపుణ్యం సాధించి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్‌లో రూ. కోటి వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బొద్దాన సంతోష్ సాధించిన ఈ ఘనత ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని వడమ కాలనీకి చెందిన కల్యాణ్ ప్రసాద్, పార్వతి దంపతుల కుమారుడు సంతోష్. తండ్రి స్థానికంగా ఓ చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సంతోష్ పదో తరగతి, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలోనే విద్యనభ్యసించారు. అనంతరం 2015లో రాజాంలోని జీఎంఆర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి, క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా తొలి ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ఎస్బీఐలో డేటా సైంటిస్ట్ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా కూడా పనిచేశారు.
అయితే, ఉన్నత శిఖరాలకు చేరాలన్న తపనతో అతను ఆ ఉద్యోగాన్ని వదిలి రీసెర్చ్ రంగం వైపు అడుగులు వేశారు. ప్రముఖ బోసెచ్ కంపెనీ రీసెర్చ్ విభాగంలో చేరి జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో పలు ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు ఇచ్చి 'ది బెస్ట్ అవార్డు'ను కూడా గెలుచుకున్నారు. ఇదే సమయంలో ఎంటెక్ (డేటా సైంటిస్ట్) పూర్తి చేసి, ఏఐకి సంబంధించిన పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తిచేశారు.
ఈ క్రమంలో ఆయనకు మైక్రోసాఫ్ట్ ఏఐ టీమ్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. కానీ, దానిని కాదనుకుని గూగుల్ వైపు దృష్టి సారించారు. గూగుల్ నిర్వహించిన పది రౌండ్ల కఠినమైన ఇంటర్వ్యూ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి, రూ.కోటి వార్షిక ప్యాకేజీతో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా (గూగుల్ ఏఐ/ఎంఎల్ విభాగం) ఎంపికయ్యారు. తన కష్టానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం తోడవడంతోనే ఈ విజయం సాధ్యమైందని సంతోష్ తెలిపారు. కుమారుడి ఘనత పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో ఏఐకి ప్రాధాన్యం పెరగడంతో తెలుగు రాష్ట్రాల యువత ఆ దిశగా అడుగులు వేస్తూ భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. గతేడాది అన్నమయ్య జిల్లాకు చెందిన అదనుకోట యశ్వంత్ కూడా కాలిఫోర్నియాకు చెందిన కంపెనీలో రూ.2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించిన విషయం తెలిసిందే.