Realme 16 5G: స్మార్ట్‌ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్.. రియల్‌మీ 16 5G ప్రత్యేకతలివే!
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ట్రెండ్ మారుతోంది. ఇప్పటివరకు అత్యుత్తమ కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్ వంటి అంశాలకే ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు వీటన్నింటితో పాటు ఫోన్ మన్నిక కూడా ఒక కీలకమైన అంశంగా మారింది. రోజువారీ జీవితంలో ఫోన్ వాడకం పెరగడంతో, అది దుమ్ము, ధూళి, నీరు వంటి వాటిని ఎంతవరకు తట్టుకుంటుందనే దానిపై వినియోగదారులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా మన్నిక విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి.
వాటర్ ప్రూఫ్ బాడీతో రియల్‌మీ కొత్త ఫోన్
సాధారణంగా స్మార్ట్‌ఫోన్లకు IP67 లేదా IP68 రేటింగ్ ఉంటుంది. ఇది ఫోన్ నీటిలో పడినా కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. కానీ రియల్‌మీ తాజాగా ఆవిష్కరించిన ‘రియల్‌మీ 16 5G’ స్మార్ట్‌ఫోన్, ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి IP69 ప్రో లెవెల్ ప్రొటెక్షన్‌ను అందిస్తోంది. ఇది సాధారణ వాటర్ రెసిస్టెన్స్‌కు పూర్తి భిన్నమైనది. IP69 అనేది ఇండస్ట్రియల్ గ్రేడ్ సర్టిఫికేషన్. దీనివల్ల ఫోన్ అధిక పీడనం (8 నుంచి 10 MPa) మరియు అధిక ఉష్ణోగ్రత (80°C వరకు) ఉన్న నీటిని కూడా తట్టుకోగలదు. అంటే, అనుకోకుండా వేడి నీళ్లు పడినా లేదా ఫోర్స్‌గా వాటర్ జెట్స్ తగిలినా ఫోన్‌కు ఎలాంటి నష్టం జరగదు.
ఇంతటి పటిష్ఠమైన రక్షణ కల్పించినప్పటికీ, ఫోన్ డిజైన్ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. రియల్‌మీ 16 5G చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటూ ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ఆటోమోటివ్ గ్రేడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు IP66, IP68, IP69 సర్టిఫికేషన్లను ఇది మిళితం చేస్తుంది.
50MP కెమెరా.. 7000mAh బ్యాటరీ
మన్నికతో పాటు ఇతర ఫీచర్లలోనూ ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఫోటోగ్రఫీ, కంటెంట్ క్రియేషన్ కోసం ముందు, వెనుక 50MP కెమెరాలను (సోనీ సెన్సర్‌తో) అమర్చారు. ముఖ్యంగా పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి ఇది ప్రత్యేకమని కంపెనీ చెబుతోంది. అలాగే, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ కోసం ఇందులో 7000mAh భారీ బ్యాటరీని పొందుపరిచారు. హెవీ యూసేజ్, గేమింగ్ సెషన్లకు కూడా ఇది అనువుగా ఉంటుంది. లేటెస్ట్ 5G కనెక్టివిటీతో వస్తున్న ఈ ఫోన్, మన్నిక, కెమెరా, బ్యాటరీ, డిజైన్ వంటి అన్ని విభాగాల్లోనూ వినియోగదారుల అంచనాలను అందుకునేలా రూపొందించబడింది.