Donald Trump: ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో దేశాల తీరుపై ట్రంప్ ఆగ్రహం

Donald Trump Angered by NATO Stance on Iran War
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో దేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించడంలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరాన్ మిలిటరీ పరంగా ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఈ దశలో కూడా అమెరికాకు నాటో దేశాల నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని వాపోయారు.

వాస్తవానికి ఇప్పటి పరిస్థితుల్లో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇలాంటి కీలకమైన సమయాల్లో వారు ప్రవర్తించిన తీరును ఎప్పటికీ మరిచిపోబోమని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో యుద్ధానికి ట్రంప్ ఐదురోజుల పాటు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో చర్చల ఫలితాన్ని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. 
Go Back to Shorts
Donald Trump
Iran
NATO
US Iran relations
Iran war
Donald Trump NATO
Iran military
US foreign policy

More Telugu News