Russia: రష్యా నుంచి భారత్‌కు 60 మిలియన్ బ్యారెళ్ల చమురు... వచ్చే నెలలో డెలివరీ

India to Receive 60 Million Barrels of Russian Oil Next Month
షార్ట్స్‌లో చూడండి
భారత చమురు సంస్థలు రష్యా నుంచి సుమారు 60 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మన దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి చమరును కొనుగోలు చేస్తోంది. ఇది వచ్చే నెలలో డెలివరీ కానున్నట్లు బ్లూమ్‌బర్గ్‌లో కథనం వచ్చింది.

బ్రెంట్ క్రూడ్ ధర కంటే బ్యారెల్‌కు 5 నుంచి 15 డాలర్లు అధికంగా చెల్లించి భారత రిఫైనరీలు ఈ చమురును బుక్ చేసినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ మొత్తం ఫిబ్రవరిలో చేసిన చమురు కొనుగోళ్ల కంటే రెట్టింపు అని వెల్లడించింది. రష్యా చమురుపై ఉన్న ఆంక్షలను ఇటీవల అమెరికా ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో తాజా కొనుగోళ్లు జరిగాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపును అమెరికా పొడిగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రష్యా నుంచి ఈ చమురు కొనుగోలుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను కూడా అమెరికా ఎత్తివేయడంతో, ఆ దేశ చమురును కూడా భారత రిఫైనరీలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Russia
India Russia oil deal
Indian oil companies
Russian oil imports
Crude oil
Oil supply
Brent Crude

More Telugu News