Hormuz Strait: అనుమతిలేదంటూ హర్మూజ్ దాటిన పాకిస్థాన్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్

Iran Returns Pakistan Ship for Lack of Hormuz Permit
షార్ట్స్‌లో చూడండి
హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లడానికి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో పాకిస్థాన్‌కు చెందిన కంటైనర్ నౌకను ఇరాన్ వెనక్కి రప్పించుకుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్ సరిహద్దుల్లోని హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి సంబంధించి ఆ దేశం నిబంధనలు విధించింది. ఈ జలసంధి మీదుగా వెళ్లడానికి అనుమతులను తప్పనిసరి చేసింది.

ఈ క్రమంలో హర్మూజ్ మీదుగా పాకిస్థాన్‌కు చెందిన కంటైనర్ కరాచీ వెళుతోంది. అయితే అనుమతులు లేకుండా ప్రయాణించడంతో ఆ నౌకను వెనక్కి రప్పించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. హర్మూజ్ గుండా వెళ్లే ప్రతి నౌక ఐఆర్జీసీ సముద్ర అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌కు చెందిన నౌకను ఇరాన్ వెనక్కి రప్పించినట్లు కాబుల్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ధృవీకరించింది. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షార్జా నుండి ఈ నౌక కరాచీకి వెళుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ జలసంధి గుండా తాము అనుమతించిన నౌకలు వెళ్లాలని చెబుతోంది.
Go Back to Shorts
Hormuz Strait
Iran
Pakistan Container Ship
IRGC
Strait of Hormuz
Karachi
UAE
Maritime Security

More Telugu News