జాతీయ అందాల పోటీల్లో మెరిసిన ఆదిలాబాద్ యువతి
- జైపూర్‌లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా పోటీల్లో విజయం
- మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026 కిరీటం కైవసం
- ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రీతి ముండే
- మిస్ కంజీనియాలిటీ ప్రత్యేక పురస్కారం కూడా సొంతం
- పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన ప్రీతి
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి ప్రీతి ముండే జాతీయ స్థాయి అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ నెల 19న జరిగిన ‘మిస్ డివైన్ బ్యూటీ 2026’ గ్రాండ్ ఫినాలేలో ఆమె ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో పాటు ‘మిస్ కంజీనియాలిటీ’ ప్రత్యేక పురస్కారాన్ని కూడా గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
డివైన్ బ్యూటీ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ప్రీతి ముండే తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. మహారాష్ట్రకు చెందిన ఆర్య ఆవధూత్ ప్రధాన టైటిల్ అయిన ‘డివైన్ మిస్ ఎర్త్ ఇండియా 2026’ను గెలుచుకోగా, ముఖ్యమైన ఎలిమెంటల్ టైటిల్స్‌లో ఒకటైన ‘వాటర్’ కిరీటాన్ని ప్రీతి దక్కించుకుంది.
ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ అనే చిన్న గిరిజన గ్రామానికి చెందిన ప్రీతి పట్టుదలతో తన కలను సాకారం చేసుకుంది. తల్లిదండ్రులు ముండే ప్రహ్లాద్, ఉమా. గ్రామీణ నేపథ్యం నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రీతి మోడలింగ్ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గతంలో ‘మిస్ హైదరాబాద్ రన్నరప్’, ‘మిస్ మహారాష్ట్ర (బ్రెయిన్ విత్ బ్యూటీ)’ వంటి టైటిల్స్‌ను కూడా గెలుచుకుంది. మోడలింగ్‌తో పాటు జ్యోతిష్యం, టారోట్ రీడింగ్ వంటి అంశాలపై కూడా ఆమెకు ఆసక్తి ఉంది.
ఒక మారుమూల ఏజెన్సీ గ్రామం నుంచి వచ్చిన యువతి జాతీయ వేదికపై విజయం సాధించడంపై ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని ప్రీతి నిరూపించిందని అభినందిస్తున్నారు.