Saleh Mohammadi: యుద్ధం వేళ, యువరెజ్లర్ సహా ముగ్గురికి ఇరాన్ మరణశిక్ష అమలు

Iran Executes Wrestler Saleh Mohammadi Amidst War
షార్ట్స్‌లో చూడండి
ఖోమ్ నగరంలో 19 సంవత్సరాల ఛాంపియన్ రెజ్లర్ సలేహ్ మొహమ్మదికి ఇరాన్ మరణశిక్షను అమలు చేసింది. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు మరణశిక్షను అమలు చేసింది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ఇరాన్ యుద్ధం చేస్తోంది. కొద్ది నెలల క్రితం ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో సంబంధం ఉన్నఈ ముగ్గురికి మరణశిక్ష విధించింది. దీనిపై మానవ హక్కుల సంఘాలు, క్రీడా సమాజం ఆందోళన వ్యక్తం చేశాయి.

గత సంవత్సరం డిసెంబర్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ఇద్దరు పోలీసుల హత్య ఘటనలో సలేహ్ మొహమ్మది, సయిద్ దావోది, మెహ్దీ మాసెమీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. నాటి నిరసనల్లో భాగమైన వారిని ఉరితీయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.

మరికొన్ని మరణశిక్షలు అమలయ్యే అవకాశం ఉందని ఇరాన్ మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ అసమ్మతిని అణిచివేసే ఉద్దేశంలో భాగంగా ఈ ఉరిశిక్షలను అమలు చేశారని తెలిపింది. ఇలాంటి దారుణాలను అడ్డుకోవడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని కోరింది.
Go Back to Shorts
Saleh Mohammadi
Iran
Wrestler
Execution
Protests
Human Rights
Khamenei
Said Davodi

More Telugu News