Telangana Budget 2026-27: శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 2

Matti Bhatti Vikramarka Announces Telangana Budget Focus on Welfare
షార్ట్స్‌లో చూడండి
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ... అంబేద్కర్ అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. వెనుకబడిన, పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. పారిశ్రామిక శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహించేందుకు... ఐటీఐ, ఏటీసీల్లో చదివే ప్రతి విద్యార్థికి నెలకు రూ. 2 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపారు. ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్టు వెల్లడించారు.

బడ్జెట్ వివరాలు:
  • శాంతి భద్రతలకు - రూ.11,907 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు - రూ.6,416 కోట్లు
  • రీజనల్ రింగ్ రోడ్డుకు - రూ1,525 కోట్లు
  • హ్యామ్ రోడ్లకు - రూ.3,053 కోట్లు
  • గోదావరి పుష్కరాలకు - రూ.500 కోట్లు
  • పంచాయతీరాజ్ రోడ్లకు - రూ.2,062 కోట్లు
  • మూసి రివర్ ఫ్రంట్‌కు - రూ.1,500 కోట్లు
  • గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్)కి - రూ.2,080 కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్లకు - రూ.5,500 కోట్లు
  • మహాలక్ష్మికి - రూ.4,305 కోట్లు
  • పర్యాటక శాఖకు - రూ.1,224 కోట్లు
  • రైతు భరోసాకు - రూ.18,000 కోట్లు
  • చేయూతకు - రూ.14,861 కోట్లు
  • పవర్ సబ్సిడీకి - రూ.14,000 కోట్లు
  • బియ్యం సబ్సిడీకి - రూ.3,000 కోట్లు
  • సన్న వడ్ల బోనస్‌కు - రూ.3,500 కోట్లు
  • పంటల బీమా పథకానికి - రూ.1,886 కోట్లు
  • కల్యాణలక్ష్మి / షాది ముబారక్ కు - రూ.3,683 కోట్లు
  • విద్యార్థుల డైట్ ఛార్జీలకు - రూ.2,170 కోట్లు
  • రాజీవ్ యువ వికాసానికి - రూ.5,800 కోట్లు
  • యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి - రూ.5,000 కోట్లు
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి - రూ.4,000 కోట్లు
  • రాజీవ్ ఆరోగ్యశ్రీకి - రూ.1,143 కోట్లు
  • రాజీవ్ యువ వికాసానికి - రూ.5,800 కోట్లు
  • మహాలక్ష్మి పథకం కింద LPG గ్యాస్ సబ్సిడీకి - రూ.723 కోట్లు
  • ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు - రూ.600 కోట్లు
  • స్కాలర్‌షిప్‌లకు - రూ.4,343 కోట్లు
  • తప్పనిసరి కార్యాలయ ఖర్చులకు - రూ.2,323 కోట్లు
  • ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు - రూ.1,500 కోట్లు
  • యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి - రూ.5,000 కోట్లు
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి - రూ.4,000 కోట్లు
  • ఉస్మానియా యూనివర్సిటీకి - రూ.1000 కోట్లు.
Go Back to Shorts
Telangana Budget 2026-27
Matti Bhatti Vikramarka
Telangana Budget
Telangana Government Schemes
Telangana
Budget Allocations
Agriculture
Education
Healthcare
Infrastructure

More Telugu News