X platform: 'ఎక్స్' సేవల్లో అంతరాయం... భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్

X Services Disrupted Globally Including India
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లు టైమ్ లైన్‌ను స్క్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్ అయినట్లు తెలుస్తోంది.

డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, రాత్రి ఎనిమిది గంటల నుంచి సేవలకు అంతరాయం ఏర్పడింది. మొబైల్, డెస్క్‌టాప్ వర్షన్‌లలో ఈ ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. రీఫ్రెష్ చేయలేకపోవడం, షేర్ చేసిన లింకులు తెరుచుకోకపోవడం, కొత్త పోస్టులలో సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి.
Go Back to Shorts
X platform
X service outage
Twitter outage
Social media outage
X down
Twitter down
India

More Telugu News