భార్య, ముగ్గురు కూతుళ్లను చంపి.. తండ్రికి టీ ఇచ్చి పరారైన కొడుకు

భార్య, ముగ్గురు కూతుళ్లను చంపి.. తండ్రికి టీ ఇచ్చి పరారైన కొడుకు

Man kills wife and three daughters serves tea to father and flees
  • రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘటన
  • నిద్రిస్తున్న సమయంలో రాయితో కొట్టి చంపినట్లు అనుమానం
  • ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
కట్టుకున్న భర్తే కసాయిగా మారాడు. భార్య, ముగ్గురు కూతుళ్లను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘోరం తర్వాత ఏమీ ఎరగనట్టు తన తండ్రికి టీ ఇచ్చి, అక్కడి నుంచి పారిపోయాడు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిందీ ఘటన. కర్ధాని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యల ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు నిందితుడు రాహుల్ ఝా (45) కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోవింద్ వాటికాలోని ఇంట్లో రాహుల్ ఝా భార్య గీతా ఝా (40), కూతుళ్లు నందిని (22), రాధిక (17), గౌరి (14) విగతజీవులుగా పడి ఉన్నారు. వీరంతా నిద్రిస్తున్న సమయంలో సిమెంట్ దిమ్మె లేదా రాయితో తలలు, ముఖాలపై బలంగా మోది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలు వేర్వేరు గదుల్లో కనిపించాయి. ఘటనా స్థలంలో పోలీసులు హత్యకు ఉపయోగించిన సిమెంట్ బ్లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హత్యల అనంతరం రాహుల్ ఉదయం 7 గంటలకు పాలు తీసుకొచ్చి, తన తండ్రి లక్ష్మీనాథ్ ఝాకు టీ కాచి ఇచ్చాడు. ఆ తర్వాత స్నానం చేసి, షేవ్ చేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత గదుల్లో రక్తపు మరకలను చూసిన లక్ష్మీనాథ్, అనుమానంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. ఉదయం 10 గంటల సమయంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడు రాహుల్ షేర్ ట్రేడింగ్ చేసేవాడని, ఇటీవల గుజరాత్ నుంచి జైపూర్‌కు మకాం మార్చాడని తెలిసింది. అతని భార్య బ్యూటీ పార్లర్ నడిపేది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాహుల్ ఇటీవల ఓ పక్కింటి వ్యక్తి దగ్గర రూ.25,000 అప్పు తీసుకున్నట్లు కూడా సమాచారం. అతను తన మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి ఇంట్లోనే వదిలివెళ్లాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆర్థిక సమస్యలే ఈ హత్యలకు ప్రధాన కారణంగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న రాహుల్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Advertisement
Rahul Jha
Jaipur murder case
Rajasthan crime news
Man kills wife and daughters
Kardhani police station
Jaipur family killing

More Telugu News