తెలంగాణ రాష్ట్రంలో ఆల్‌టైమ్ గరిష్ఠానికి విద్యుత్ వినియోగం

Telangana Electricity Consumption Reaches All Time High
  • రాష్ట్రంలో నిన్న 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం
  • ఉష్ణోగ్రతలు అధికం కావడానికి తోడు పెరిగిన వ్యవసాయ విద్యుత్ వినియోగం
  • భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్నట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన 341 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. దీనితో తెలంగాణలో వినియోగం ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడం, వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిన సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.
Go Back to Shorts
Telangana Electricity
Telangana power consumption
Telangana power demand
Mallu Bhatti Vikramarka
Telangana summer
Telangana agriculture
Telangana news
Electricity consumption record

More Telugu News