Uttam Kumar Reddy: తెలంగాణలో వంటగ్యాస్ కొరత లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy clarifies no LPG shortage in Telangana
తెలంగాణలో వంటగ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయని లేదా కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ముందుగానే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని, దీనితో సాధారణం కంటే రెట్టింపు సిలిండర్లు బుక్ అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో గృహ అవసరాలకు ఎలాంటి వంటగ్యాస్ కొరత లేదని, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రమే ఉందని తెలిపారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో 810 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, ప్రస్తుత పరిస్థితులపై వారితో చర్చించామని మంత్రి తెలిపారు. తెలంగాణలో 1.3 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులు ఉన్నట్లు వెల్లడించారు. దీపం పథకం కింద 28 లక్షల మంది ఎల్పీజీని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. గృహ వినియోగదారులు ప్రతి నెల 60 లక్షల సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
Uttam Kumar Reddy
Telangana
LPG shortage
Cooking gas
Gas cylinder booking
LPG distributors

More Telugu News