చర్లపల్లి ప్లాంట్లలో తగ్గిన గ్యాస్ సరఫరా.. రోడ్లపై నిలిచిన ట్యాంకర్లు
- భారీగా తగ్గిన ఇంధన కోటా.. మూడు ప్లాంట్లలోనూ అదే పరిస్థితి
- కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన ఆంక్షలు
- పరిమిత సంఖ్యలో మధ్యాహ్నం 12 తర్వాత టోకెన్ల జారీ
పరిమిత సంఖ్యలో టోకెన్లు
ప్రస్తుతం నెలకొన్న కొరత దృష్ట్యా కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల పంపిణీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాతే కొనుగోలుదారులకు టోకెన్లు జారీ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే సిలిండర్లను అందజేస్తుండటంతో వ్యాపారులు, ఏజెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ జామ్ - వాహనాల బారులు
గ్యాస్ సరఫరా ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితుల్లో భారీ సంఖ్యలో ఇంధన వాహనాలు చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ప్రధాన రహదారులపై నిలిచిపోయాయి. దీనివల్ల స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.