ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. రేపటి నుంచి బెంగళూరులో రెస్టారెంట్ల మూసివేత!
- నగరవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లను మూసివేయక తప్పదంటున్న అసోసియేషన్
- కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటళ్లను నిర్వహించలేమని వెల్లడి
- గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని వెల్లడి
గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది.