Raghurama Krishnam Raju: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. సునీల్ నాయక్ ను తొలిరోజు 7 గంటల పాటు విచారించిన అధికారులు

Raghurama Custodial Torture Case Sunil Nayak Questioned for 7 Hours
  • హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన సునీల్ నాయక్
  • అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం
  • ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనున్న విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన 'కస్టడీ చిత్రహింసల' కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తొలిరోజు విచారణ ముగిసింది. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ విచారణ, విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన సునీల్ నాయక్, అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.


రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో ఉంచిన ఆ రాత్రి, సునీల్ నాయక్ పలుమార్లు ఆ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై అధికారులు ప్రశ్నించగా, ఆయన కేవలం అరకొర సమాధానాలతోనే సరిపెట్టినట్లు సమాచారం. సీఐడీ కార్యాలయంలో ఆ రాత్రి జరిగిన పరిణామాలు, ఎవరి ఆదేశాల మేరకు ఆయన అక్కడికి వెళ్లారు అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగాల్సి ఉంది. అంటే, మరో నాలుగు రోజుల పాటు ఆయన పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. రాబోయే నాలుగు రోజుల్లో ఆయన ఎలాంటి వాంగ్మూలం ఇస్తారో, ఈ కేసులో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.

Raghurama Krishnam Raju
Sunil Nayak
Custodial torture case
AP Deputy Speaker
CID investigation
Guntur CCS Police Station
Vijayanagaram SP Damodar
Andhra Pradesh politics
High Court orders

More Telugu News