కర్ణాటకలో ఇంటి ఆవరణలో ఆరు కొండచిలువలు

Six Pythons Found in Karnataka Home
  • కార్వార్ పట్టణంలోని కతినకోన ప్రాంతంలో కనిపించిన కొండచిలువలు
  • విజయ్ కాలేకర్ ఇంటి ఆవరణలో ఇనుప సామగ్రి వద్ద కనిపించిన కొండచిలువలు
  • కొండచిలువలను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన అధికారులు
కర్ణాటకలోని కార్వార్‌లో ఒక ఇంటి ఆవరణలో ఆరు కొండచిలువలు కనిపించడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది. కార్వార్ పట్టణంలోని కతినకోన ప్రాంతంలో నివాసం ఉంటున్న విజయ్ కాలేకర్ ఇంటి ఆవరణలో ఈ కొండచిలువ పాములు కనిపించాయి. ఇంటి బయట ఉంచిన ఇనుప సామగ్రి వద్ద వీటిని గుర్తించారు.

ఆదివారం రోజు ఇనుప సామగ్రి వద్ద ఏదో కదులుతున్నట్లుగా గుర్తించిన విజయ్ కాలేకర్ కుటుంబసభ్యులు దగ్గరకు వెళ్లి చూడగా కొండచిలువలు కనిపించాయి. ఆరు కొండచిలువలు ఒక్కొక్కటి 8 నుంచి 12 అడుగుల పొడవు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించగా, అధికారులు వాటిని పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
Go Back to Shorts
Karnataka
Karwar
Python
Snakes
Vijay Kalekar
Wildlife
Forest Department
Reptiles

More Telugu News