ట్రంప్ కొత్త సుంకాల అమలుపై సందిగ్ధత
- 15 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్
- ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఇంకా సంతకం చేయని అమెరికా అధ్యక్షుడు
- సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్ తో రేపటి నుంచి ప్రతీకార సుంకాలు బంద్
రేపటి నుంచే నిలిపివేత..
‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఈఈపీఏ) కింద ఇప్పటివరకు వసూలు చేస్తున్న టారిఫ్‌లను అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీ అర్ధరాత్రి 12:01 గంటల నుంచి నిలిపివేస్తారు. ఈ పరిణామంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు 15 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు దిగుమతిదారులు చెల్లించిన వేల కోట్ల టారిఫ్ సొమ్మును తిరిగి చెల్లిస్తారా (రిఫండ్) లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ట్రంప్ పంతం..
సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టిన ట్రంప్.. ఎలాగైనా 15 శాతం సుంకాలు అమలు చేస్తానని మళ్ళీ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’ ఇంకా వెలువడకపోవడంతో కొత్త టారిఫ్‌లు రేపటి నుంచి అమలవుతాయా లేదా అన్నది సందిగ్ధంలో పడింది.