Anantha Babu: ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో కీలక పరిణామం..అప్పటి డీఎస్పీ సహా నలుగురిపై సస్పెన్షన్
- అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో నలుగురు పోలీసులపై వేటు
- సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు
- నిందితుడికి సహకరించారన్న ఆరోపణలతో సస్పెన్షన్
- అప్పటి డీఎస్పీ భీమారావు సహా నలుగురు అధికారుల సస్పెన్షన్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ రావు (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. దర్యాప్తులో పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
2022లో జరిగిన ఈ హత్య కేసు దర్యాప్తులో నిందితుడైన అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఈ వేటు పడింది. ఈ కేసు విచారణ "పోలీసు-అధికార వర్గాల కుమ్మక్కుకు స్పష్టమైన ఉదాహరణ" అని ఫిబ్రవరి 20న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఛార్జిషీట్ దాఖలులో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి, నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా పోలీసులు సహకరించారని కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది.
కేసు నేపథ్యం ఏమిటి?
2022 మే 19న కాకినాడలో అనంతబాబు డ్రైవర్, దళిత యువకుడైన వీధి సుబ్రహ్మణ్యం (34) మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. అప్పు విషయంలో జరిగిన చిన్న గొడవలో ప్రమాదవశాత్తు చనిపోయాడని మొదట చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అయితే, ప్రజాసంఘాల ఆందోళనలతో అనంతబాబుపై హత్య (సెక్షన్ 302), సాక్ష్యాల ధ్వంసం (సెక్షన్ 201), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కానీ, దర్యాప్తులో జాప్యం కారణంగా 2022 డిసెంబర్‌లో ఆయన డిఫాల్ట్ బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పట్లో పెరిగిన ప్రజా వ్యతిరేకతతో వైసీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఫోరెన్సిక్, సీసీటీవీ, డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన సిట్, ఇది ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని నిర్ధారిస్తూ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీ దుర్గలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
తాజా పరిణామాలు
సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా, ప్రాథమిక దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం, కుమ్మక్కు స్పష్టంగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షించాలని, 2026 నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. సాక్షులను బెదిరిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో, కేసులో కీలక ఆధారాలను విస్మరించి నిందితుడైన అనంతబాబుకు సహకరించిన నలుగురు పోలీస్ అధికారులపై డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండ్ అయిన వారిలో కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన అప్పటి కాకినాడ డీఎస్పీ, ప్రస్తుతం భీమవరం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న వి. భీమారావు, వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసి ప్రస్తుతం కోనసీమ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆకుల మురళీకృష్ణ, అప్పట్లో సర్పవరం స్టేషన్ ఎస్‌ఐగా ఉన్న ఎన్.సతీష్ బాబు ఉన్నారు. వీరిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని, 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రభుత్వం ఆదేశించింది.