ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Mounika Two Dead in Outer Ring Road Accident Near Sangareddy
  • పోచారం వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు
  • ఓఆర్ఆర్ రోడ్డు నుంచి సర్వీసు రోడ్డు పైకి ఎగిరిపడిన కారు
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
సంగారెడ్డి జిల్లాలోని పోచారం వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఓఆర్ఆర్ నుంచి సర్వీసు రోడ్డు పైకి ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మౌనిక (36), నవీన్ (30) అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన హరిప్రసాద్, హర్ష, అమృత, సుశ్రుతలను పటాన్‌చెరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

వీరిలో సుశ్రుత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బోరంపేటకు చెందిన వీరంతా జూపార్కుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Mounika
Outer Ring Road
ORR Accident
Sangareddy
Pocharaam
Road Accident
Telangana News

More Telugu News