Prabhakar: నా కొడుకు తప్పును సమర్థించడం లేదు.. కానీ!: చంద్రహాస్ అసభ్యకర పాటపై నటుడు ప్రభాకర్

Prabhakar Responds to Son Chandrahass Controversial Song
షార్ట్స్‌లో చూడండి
'బరాబర్ ప్రేమిస్తా' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన కుమారుడు, చిత్ర కథానాయకుడు చంద్రహాస్ పాడిన పాట వివాదాస్పదం కావడంపై నటుడు ప్రభాకర్ స్పందించారు. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్న పొరపాటుతో తన పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని కోరారు. తన కుమారుడి ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించాలని ఆయన బహిరంగంగా కోరారు.

గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో తన కుమారుడు చంద్రహాస్ ఉపయోగించిన అసభ్యకర పదాలపై చర్చ సాగుతోందని అన్నారు. తన కొడుకు అయినా, మరెవరైనా ఇలాంటి పదాలు ఉపయోగించడాన్ని తప్పు అనే చెబుతానని అన్నారు. ఇలాంటి వైఖరిని తాను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. ఈవెంట్ పూర్తయ్యాక తాను బహిరంగంగా కాకపోయినా, వ్యక్తిగతంగా తన కుమారుడికి అలాంటి పాటలు పాడకూడదని చెప్పానని అన్నాడు. ఈవెంట్ రోజు కూడా తాను మధ్యలో హాజరయ్యానని అన్నారు.

తప్పు చేసిన వారిని శిక్షించాలనుకోవడం తప్పు కాదని, కానీ వినకూడని పదాలను మరికొందరికి వినిపించడం బాధ్యత అనిపించుకోదని అన్నారు. ఆ పాటలో రెండు మూడు అసభ్యకర పదాలు ఉంటే, దానిని చూపించి అవతలి వారు ఇరవై, ముప్పై అసభ్యకర పదాలు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ కార్యక్రమంలో తన భార్య, కూతురు లేకున్నప్పటికీ వారిని లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. తన పెంపకం గురించి కూడా చాలామంది ప్రశ్నించారని, కానీ ఈ ఒక్క కారణంతో పెంపకం గురించి ప్రశ్నించడం సరికాదని అన్నారు. తన కొడుకు తప్పును ఎత్తి చూపడాన్ని తాను తప్పుబట్టడం లేదని అన్నారు. తన కుమారుడి తీరుతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. జేడీ చక్రవర్తికి, జయంత్ సి పరాన్జీకి కూడా ఆయన క్షమాపణలు చెప్పారు.
Go Back to Shorts
Prabhakar
Chandrahas
Barabar Preminchista
Telugu Movie
Controversy
Apology
Actor Prabhakar

More Telugu News