Eric: మొబైల్ లో ఆ వీడియోలు వెతుకుతుంటే తన వీడియో కనిపించింది.. చైనా వ్యక్తికి షాకింగ్ అనుభవం
- తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ హోటల్ లో దిగినప్పుడు రహస్యంగా చిత్రీకరణ
- ఆన్ లైన్ లో తమ వీడియో చూశాక తీవ్ర ఆందోళనకు గురయ్యామంటూ ఆవేదన
- బయట అడుగుపెట్టాలంటే ముఖం చెల్లలేదని వెల్లడి
చైనాకు చెందిన ఓ వ్యక్తి తరచూ పోర్న్ వీడియోలు చూడడం అలవాటు.. ముఖ్యంగా స్పై కెమెరాతో చిత్రీకరించిన వీడియోలంటే ఇష్టపడేవాడు. వాటి కోసం వివిధ సైట్లు గాలిస్తుండేవాడు. ఒకరోజు అలాగే సెర్చ్ చేస్తుంటే స్క్రీన్ పై తన ముఖమే కనిపించడంతో కంగుతిన్నాడు. తను, తన గర్ల్ ఫ్రెండ్ ఓ హోటల్ రూమ్ లో సన్నిహితంగా గడిపిన దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి ఆ సైట్ లో పెట్టినట్లు గుర్తించాడు.
దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని, తన గర్ల్ ఫ్రెండ్ కు ఈ విషయం చెబితే తను నమ్మలేదని చెప్పాడు. వీడియో చూపించాక ఆమె కూడా భయాందోళనలకు గురైందని, తమకు తెలిసిన వాళ్లు, కుటుంబ సభ్యులు ఆ వీడియో చూసి ఉంటారని మనస్తాపం చెందామని తెలిపాడు. సింగపూర్ లో స్థిరపడ్డ ఎరిక్ అనే వ్యక్తికి ఈ భయానక అనుభవం ఎదురైంది.
పోర్న్ సైట్ లో తన వీడియో చూసుకున్నాక తనకు వాటిపై ఉన్న ఆసక్తి మొత్తం పోయిందని ఎరిక్ చెప్పాడు. బయటకు వెళితే ఎవరైనా గుర్తిస్తారనే ఉద్దేశంతో గడపదాటాలన్నా టెన్షన్ పడ్డామని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ముఖాన్ని కవర్ చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. 2023 లో దక్షిణ చైనాలోని షెంజెన్ నగరంలో తాము ఓ హోటల్ లో బస చేశామని ఎరిక్ చెప్పాడు. ఆ గదిలో అమర్చిన సీక్రెట్ కెమెరాతో తమను రికార్డ్ చేశారని తెలిపాడు. వీడియోలో ఆ గదిని చూసి నాటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నామని వివరించాడు. ఇప్పుడు హోటల్ గదిలో దిగాలంటేనే తమకు వణుకు పుడుతోందని ఎరిక్ చెప్పుకొచ్చాడు.
చైనాలో స్పై కెమెరాలతో జంటలను రికార్డు చేసి ఆ వీడియోలను పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేయడం ఇటీవల ఎక్కువైంది. దీనిని కట్టడి చేయడానికి చైనా కఠిన చట్టాలు తీసుకొచ్చింది. హోటల్ నిర్వాహకులు రెగ్యులర్ గా తమ హోటల్ లోని గదులను తనిఖీ చేయాలని, సీక్రెట్ కెమెరాలు అమర్చే వీలు లేకుండా జాగ్రత్తపడాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయినప్పటికీ ఈ బెడద పూర్తిగా తొలగిపోలేదని అధికారులు చెబుతున్నారు.