Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కల్యాణ్ భేటీ

Pawan Kalyan Meets Janasena Leaders on Telangana Elections
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ భేటీ అయ్యారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి వారితో చర్చించారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రాజలింగం, సాగర్ (ఆర్కే నాయుడు) తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో... ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. పోటీలో బీజేపీ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక ప్రకటన చేశారు. తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కల్యాణ్ ను కలిశామని... మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఆయన పూర్తి మద్దతు తెలిపారని వెల్లడించారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Telangana Municipal Elections
BJP
Telangana Politics
Kishan Reddy
Ramchander Rao
Telangana Elections
Municipal Elections 2024

More Telugu News