Vijay TVK: టీవీకే అధినేత విజయ్‌పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

Piyush Goyal Comments on Vijay TVK Alliance for Tamil Nadu Elections
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే), బీజేపీ మధ్య పొత్తు అవకాశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌తో బీజేపీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. రాజకీయాల్లో విజయ్ ప్రభావంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం ఓట్లు చీల్చే స్థాయికే పరిమితమవుతారని, కింగ్‌గా మాత్రం ఎదగలేరని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. 

గతంలోనూ పలువురు సినీనటులు రాజకీయాల్లోకి వచ్చారని, అయితే వారు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. టీవీకేతో బీజేపీకి ఎలాంటి పొత్తు అవకాశం లేదని మరోసారి స్పష్టం చేసిన ఆయన.. బీజేపీ - అన్నాడీఎంకే కూటమి తమిళనాడులో అద్భుత విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీసుకుంటున్న వైఖరిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని పీయూష్ గోయల్ అన్నారు. తమిళనాడులో బీజేపీ తన సొంత బలాన్ని పెంచుకుంటూనే, పాత మిత్రులతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుందని వెల్లడించారు. 
 
ఇదిలా ఉండగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రచారం చేస్తోంది. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ద్రవిడయన్ పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే రెండూ బీజేపీకి లొంగిపోయాయని విజయ్ ఆరోపించారు. డీఎంకే నేరుగా లొంగిపోతే, అన్నాడీఎంకే పరోక్షంగా లొంగిపోయిందని విమర్శించారు. తమిళనాడులో టీవీకేనే ఏకైక ప్రత్యామ్నాయం అని విజయ్ స్పష్టం చేస్తున్నారు. 
Go Back to Shorts
Vijay TVK
Piyush Goyal
Tamil Nadu elections
BJP alliance
Tamilaga Vettri Kazhagam
ADMK
DMK
Udhayanidhi Stalin
Tamil Nadu politics

More Telugu News