Gaddar: గద్దర్ అవార్డుల దరఖాస్తులకు గడువు పొడిగింపు

Gaddar Film Awards Application Deadline Extended
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల (2025)దరఖాస్తుల సమర్పణ గడువును ఫిబ్రవరి 5వ తేదీ వరకు పొడిగించినట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి మరింత ముందుగానే నిర్వహించేందుకు ఎఫ్ఢీసీ ఏర్పాట్లు చేస్తోంది. 

గత ఏడాది ప్రారంభమైన ఈ అవార్డుల నిర్వహణపై ప్రభుత్వం జనవరిలోనే కసరత్తు మొదలుపెట్టింది. గద్దర్ అవార్డులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసిన ప్రభుత్వం, ఈసారి ప్రముఖ కవి సి. నారాయణరెడ్డి పేరుతో కూడా ప్రత్యేక అవార్డును అందించనుంది. ఈ నేపథ్యంలో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించిన అప్లికేషన్లు జనవరి 31 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు, ఫిబ్రవరి 3లోగా వాటిని సబ్మిట్ చేయాలని తొలుత ప్రకటించింది. 

అయితే వరుసగా బ్యాంక్ సెలవులు రావడంతో గడువును ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అప్లికేషన్లు అందజేయనున్నట్లు తెలిపింది. అలాగే అదే రోజు సాయంత్రం 4 గంటలలోగా అప్లికేషన్లను తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సినిమా రంగానికి చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  సూచించింది.
Go Back to Shorts
Gaddar
Gaddar Film Awards
Telangana Film Development Corporation
TGFDC
C Narayana Reddy Award
Telangana film industry
Film awards application
Movie awards
Telangana government
Cinema

More Telugu News