ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు

Bandar Abbas Port in Iran Hit by Massive Explosion
  • ఏనిమిది అంతస్తుల భవనంలో పేలుడు
  • భవనంతో పాటు వాహనాలు, దుకాణాలు ధ్వంసం
  • నేవీ కమాండర్ లక్ష్యంగా దాడి జరిగినట్లు ప్రచారం
  • ఖండించిన స్థానిక మీడియా
ఇరాన్ నగరం బందర్ అబ్బాస్‌లోని ఒక భవనంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మోలెం బౌలేవార్డ్ ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుడుకు భవనంతో పాటు పలు వాహనాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ కమాండర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. స్థానిక మీడియా మాత్రం వాటిని ఖండించింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ పేలుడు కలకలం రేపింది.

బందర్ అబ్బాస్ నౌకాశ్రయం హర్ముజ్ జలసంధిలో ఉంది. ఇరాన్, ఒమన్‌ల మధ్య ఇది కీలక జలమార్గం. ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. గత ఏడాది ఏప్రిల్‌లో కూడా బందర్ అబ్బాస్ సమీపంలోని పోర్టులో భారీ పేలుడు సంభవించిన ఘటనలో వందలాదిమంది గాయపడినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి.
Advertisement
Bandar Abbas
Iran
Bandar Abbas explosion
Iran port explosion
Hormuz Strait
Iran Revolutionary Guard

More Telugu News