కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు: కవిత పార్టీ ప్రకటనపై బీజేపీ అధ్యక్షుడు
- ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చన్న రామచందర్ రావు
- కవిత పార్టీ పెట్టడం వల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదన్న అధ్యక్షుడు
- కవిత ఆత్మగౌరవం దెబ్బతినడం ఆమె కుటుంబానికి సంబంధించిన అంశమని వ్యాఖ్య
వీబీ జీ రామ్ జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని రామచందర్ రావు ఖండించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరికీ ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. పలు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ పార్టీకి కావాలని ఆయన విమర్శించారు.