మహేశ్ బాబుపై గతంలో గుణశేఖర్ కామెంట్స్.. మళ్లీ వైరల్
- మహేశ్ తో మూడు సినిమాలు చేసిన గుణశేఖర్
- మహేశ్ మత్తులాంటి వ్యక్తి అని వ్యాఖ్య
- ఆయనతో తాను వరుసగా సినిమాలు చేయడం తన తప్పు అని వ్యాఖ్య
గుణశేఖర్ మాటల్లో చెప్పాలంటే.. మహేశ్ బాబు దర్శకులను తన నటనతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటారట. డైరెక్టర్ 100 శాతం అడిగితే, మహేశ్ 200 శాతం అవుట్‌పుట్ ఇచ్చే ‘మాయగాడు’ అని ఆయన ప్రశంసించారు. వరుసగా ఒకే హీరోతో మూడు సినిమాలు చేయడం వల్ల తన కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చిందని... ఆ మాయలో పడకుండా వేరే హీరోలతో కూడా సినిమాలు చేయాల్సింది అని గుణశేఖర్ పేర్కొన్నారు.