మూడు రోజుల కస్టడీకి ఐబొమ్మ రవి.. బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ
- పోలీసుల కస్టడీ పిటిషన్‌కు నాంపల్లి కోర్టు ఆమోదం
- ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున విచారణకు అనుమతి
- ఒక కేసులో కస్టడీ పిటిషన్ తిరస్కరించిన కోర్టు
పోలీసులు రవిపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేయగా, ఒక కేసులో కస్టడీ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మిగిలిన మూడు కేసులకు సంబంధించి ఒక్కో కేసుకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం, సోమవారం, మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
ఈ కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. మరోవైపు, రవి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలను సోమవారం వింటామని కోర్టు తెలిపింది.