జేడీయూ, బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు ఆర్జేడీకే.. అయినా తప్పని ఓటమి
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల షేర్ లో ఆర్జేడీదే ఆధిక్యం
- మొత్తం ఓట్లలో 23 శాతం ఓట్లు తేజస్వీ యాదవ్ పార్టీకే..
- బీజేపీకి 20 శాతం ఓట్లు, జేడీయూకు 19.25 శాతం ఓట్లు
అయితే, ఈ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీకి ఓట్లేసిన వారి సంఖ్య మిగతా పార్టీలకంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలలోనూ కలిపి మొత్తం పోలైన ఓట్లలో 23 శాతం ఓట్లు ఆర్జేడీ పార్టీకే పడ్డాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఘన విజయం సాధించిన బీజేపీ, జేడీయూ పార్టీలు ఓట్ షేర్ లో మాత్రం వెనుకంజలోనే ఉన్నాయి. బీజేపీకి 20 శాతం ఓట్లు పోలవగా.. సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 19.25 శాతం ఓట్లు పోలయ్యాయి.