Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి వేడుకలు .. సోషల్ మీడియాలో ఫోటోల వైరల్
- బాలీవుడు దర్శకుడు రాజ్ నిడిమోరు కుటుంబంతో సమంత దీపావళి వేడుకలు
- ఫోటోలు షేర్ చేస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని పేర్కొన్న సమంత
- మళ్లీ ఊపందుకున్న డేటింగ్ రూమర్స్
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
తాజాగా రాజ్ నిడిమోరు కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాణసంచా కాలుస్తున్న ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. "నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది" అని వ్యాఖ్యానించారు. ఈ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
గతంలో రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లలో సమంత నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆమెకు రాజ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై ఇరువురూ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.