విండీస్ ఫాలో ఆన్.. కుల్ దీప్ దెబ్బకు కుప్పకూలిన బ్యాటింగ్ లైనప్
- 248 పరుగులకు కుప్పకూలిన విండీస్
- 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన స్పిన్నర్
- ఆఖర్లో పియరీ - ఫిలిప్ జోడీ దూకుడు
పియరీ - ఫిలిప్ జోడీ దూకుడు..
భారత బౌలర్ల ధాటికి విండీస్ తొలి సెషన్‌లోనే ఆలౌట్ అవుతుందని భావించినా.. ఆఖర్లో పియరీ - ఫిలిప్ జోడీ దూకుడు ప్రదర్శించింది. దాదాపు 16 ఓవర్లపాటు ఈ జోడీ నిలబడింది. క్రీజ్‌లో పాతుకుపోతున్నట్లు కనిపించిన ఈ జోడీని లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా విడదీశాడు. రెండో సెషన్ తొలి ఓవర్‌లోనే పియరీని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సీలెస్ తో కలిసి ఫిలిప్ భారత బౌలర్లను విసిగించాడు. వీరిద్దరూ తొమ్మిది ఓవర్లు ఎదుర్కొన్నారు. సీలెస్ ను కుల్ దీప్ ఔట్ చేయడంతో విండీస్ ఆలౌట్ అయింది.