Rishab Shetty: 'కాంతార' థియేటర్లో పంజుర్లి దేవుడి ప్రత్యక్షం.. షాకైన ప్రేక్షకులు!
- దేశవ్యాప్తంగా కాంతార చాప్టర్ 1 ప్రభంజనం
- తమిళనాడు థియేటర్లో ఆసక్తికర ఘటన
- పంజుర్లి దైవం వేషధారణలో ఓ వ్యక్తి హల్‌చల్
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఓవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా, మరోవైపు థియేటర్లలో ఊహించని పరిణామాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమిళనాడులోని ఓ థియేటర్‌లో సినిమా ప్రదర్శన జరుగుతుండగా చోటుచేసుకున్న ఓ వింత ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఒక థియేటర్‌లో 'కాంతార చాప్టర్ 1' సినిమా ప్రదర్శితమవుతోంది. ఉన్నట్టుండి పంజుర్లి దైవం వేషధారణలో ఓ వ్యక్తి థియేటర్‌లోకి ప్రవేశించాడు. తెరపై రిషబ్ శెట్టి చేస్తున్న నృత్యాన్ని అచ్చుగుద్దినట్లు అనుకరిస్తూ డాన్స్ చేయడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిజంగానే దైవం ఆవహించిందేమోనని కొందరు భ్రమపడ్డారు. ఈ దృశ్యాలు చూసి తమకు గూస్‌బంప్స్ వచ్చాయని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో వచ్చిన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైంది. తొలి భాగం సాధించిన విజయంతో ఈ సినిమాపై ముందునుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 224 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం నివ్వెరపరిచింది. దసరా సెలవులు తోడవడంతో దేశమంతటా థియేటర్లు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి.
హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా, జయరాం, గుల్షన్ దేవయ్య వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విజయంతో రిషబ్ శెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.