ఆదిలాబాద్‌లో కుప్పకూలిన కలెక్టరేట్ భవనం పైఅంతస్తు
- గురువారం రాత్రి ప్రమాదం
- స్లాబ్ నెమ్మదిగా కూలడంతో తప్పిన ప్రమాదం
- బయటకు పరుగు తీసిన ఉద్యోగులు
కలెక్టరేట్‌లోని సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం ఉండటంతో ఉద్యోగులందరూ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.