ఆయనలా బాధపడితే 500 సార్లు ఆత్మహత్య చేసుకునేవాడిని: బండ్ల గణేశ్
- ‘తెల్ల కాగితం’ ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన బండ్ల గణేశ్
- దర్శకుడి కష్టాలపై తనదైన శైలిలో స్పందన
- విమర్శలను పట్టించుకుంటే 500 సార్లు ఆత్మహత్య చేసుకునేవాడినని వ్యాఖ్య
- నిర్మాత కృష్ణ కొమ్మాలపాటి మనసు తెల్ల కాగితం వంటిదన్న బండ్ల
- అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘తెల్ల కాగితం’
హర్ష్ రోషన్ హీరోగా, నక్షత్ర హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘తెల్ల కాగితం’. రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వంలో, అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.
వేడుకలో దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి తన ప్రయాణంలో ఎదురైన కష్టాల గురించి ప్రస్తావించగా, బండ్ల గణేశ్ దానిపై స్పందించారు. "డైరెక్టర్ రమేశ్ బాధ పడ్డానని, అమ్మను తీసుకొచ్చానని, దుఃఖ పడ్డానని అంటున్నాడు. ఆయనలాగా నేను బాధపడితే ఇప్పటికి 500 సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే నా గురించి రోజూ ఏదో ఒకటి రాస్తారు.
జీవితంలో పక్కోడి గురించి ఆలోచిస్తే, నేను షాద్‌నగర్‌లో కూడా ఉండేవాడిని కాదు. మనం మన గురించే ఆలోచించుకోవాలి, ఎదగడానికి ప్రయత్నించాలి. పక్కోడు మన గురించి ఏడవాలి, తిట్టాలి, మనం మాత్రం పైకి చేరుకోవాలి" అంటూ తనదైన మార్క్ ప్రసంగంతో అందరినీ ఉత్తేజపరిచారు.
అనంతరం నిర్మాత కృష్ణ కొమ్మాలపాటితో తనకున్న స్నేహాన్ని బండ్ల గణేశ్ గుర్తుచేసుకున్నారు. "నిర్మాత కృష్ణ అన్న మనసు ఒక తెల్ల కాగితం. ఎంతోమంది ఆయనతో పనిచేయించుకుని వదిలేశారు. ఆయన జీవితం వైకుంఠపాళిలా సాగింది. నిచ్చెన ఎక్కుతుంటే పాము కరిచింది. కానీ ఈసారి మాత్రం ఆయన పెద్ద నిచ్చెన ఎక్కి గోల్ కొడతారని నమ్ముతున్నాను" అని అన్నారు.
కృష్ణ తన వ్యాపారాన్ని, కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి కేవలం సినిమా, స్నేహితుల కోసమే జీవిస్తున్నారని, ఆయన త్యాగం గొప్పదని కొనియాడారు.
‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘తెల్ల కాగితం’ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.