యాకుత్ పురాలో మ్యాన్ హోల్ లో పడిపోయిన బాలిక.. వెంటనే స్పందించిన తల్లి.. వీడియో ఇదిగో!
––
పరుగున మ్యాన్ హోల్ దగ్గరికి చేరుకుని బాలికను పైకి లాగింది. దీంతో బాలికకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మొత్తం అక్కడికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, రోడ్డుపై మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచిన మున్సిపల్ సిబ్బందిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా పాప ప్రాణాలు పోయేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.