Pawan Kalyan: అల్లు కనకరత్నం పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్, అకీరా... వీడియో ఇదిగో!
- ఇటీవల కన్ను మూసిన అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ
- హైదరాబాదులో పెద్దకర్మ కార్యక్రమం
- ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన పవన్ కల్యాణ్, అకీరా నందన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి అల్లు కనకరత్నమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి, మెగాస్టార్ చిరంజీవి అత్తగారైన అల్లు కనకరత్నమ్మ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ప్రఖ్యాత హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ (94) వృద్ధాప్య సమస్యల కారణంగా కొన్ని రోజుల కిందట తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో హైదరాబాద్ శివారులోని కోకాపేటలో నిర్వహించారు.
ఈ నేపథ్యంలో, హైదరాబాదులో దశ దిన కర్మకాండలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ తనయుడు అకీరాతో కలిసి హాజరయ్యారు. కనకరత్నమ్మ చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం అల్లు అరవింద్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, అకీరాను ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయంగా పలకరించడం వీడియోలో చూడొచ్చు.