ఈడీ ఆఫీసుకు చేరుకున్న రానా.. వీడియో ఇదిగో!
- నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కేసులో విచారణ
- తొలిసారి నోటీసులు పంపగా గడువు కోరిన రానా
- ఈ కేసులో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరు
దీంతో విచారణ తేదీని ఈ రోజుకు మార్చుతూ ఈడీ అధికారులు రెండోసారి సమన్లు జారీ చేశారు. తాజాగా రానా ఈడీ ఆఫీసుకు వెళ్లి అధికారుల ముందు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేశారనే కేసులో సెలబ్రిటీలకు నోటీసులు పంపిన ఈడీ.. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ లను విచారించింది. ఈ నెల 13న నటి మంచు లక్ష్మి విచారణకు హాజరవుతారని సమాచారం.