కోట్ల రూపాయల మోసాలు.. వైసీపీ నేతపై లుకౌట్ నోటీసులు
- వ్యాపారాల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన సత్యసాయి జిల్లా వైసీపీ నేత సూరి
- పీడీ యాక్ట్ నమోదు చేశామన్న జిల్లా ఎస్పీ రత్న
- సూరిపై మొత్తం 36 కేసులు
కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడడమే కాకుండా, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడినట్టు విచారణలో తేలిందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. సూరిపై కొత్తచెరువు పీఎస్ లో 20 కేసులు, నెల్లూరు రూరల్ పీఎస్ లో 16 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సూరి బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సూరి ఆచూకీ తెలపాలంటూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు.