బాగా చంపి ఫేమస్ అయ్యేదా.. అక్కను చంపే ముందు రీల్ చేసిన తమ్ముడు
- పెంజర్ల హత్యలో మరో ట్విస్ట్.. పథకం ప్రకారమే చంపేశాడా?
- ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు
- ఇన్ స్టాలో వైరల్ గా మారిన వీడియో
"బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా" అంటూ రోహిత్ రీల్ చేశాడు. దీంతో అక్క వల్ల కుటుంబం పరువు పోతుందనే కారణంతో పాటు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోహిత్ పథకం ప్రకారమే రుచితను హత్య చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.