నేడు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి... వైరల్ గా మారిన ట్వీట్
- లిక్కర్ స్కామ్ లో మరోసారి సిట్ విచారణకు హాజరవుతున్న విజయసాయి
- భగవద్గీతలోని శ్లోకాన్ని ట్వీట్ చేసిన వైనం
- కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదని ట్వీట్
భగవద్గీతలోని"కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన! మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!!" శ్లోకాన్ని ఆయన ట్వీట్ చేశారు.
"కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు" అంటూ దాని అర్థాన్ని కూడా వివరించారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.