ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
- పెళ్లికి పెద్దలు నిరాకరించడమే కారణం
- కొమరోలు మండలం అక్కపల్లెలో ఘటన
- చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం
- మృతులు నంద్యాల జిల్లా వాసులుగా గుర్తింపు
- కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు
స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న యువతీ యువకుడి మృతదేహాలను గుర్తించారు. మృతులను నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.